జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఇండ్లలో ఏసీబీ సోదాలు

ACB Raids{రవాణాశాఖలో జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇండ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ తో పాటు ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. డీటీసీ శ్రీనివాస్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. ఆదిలాబాద్ డీటీసీగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు. 50 కోట్లకు పైచిలుకు ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.