బీజేపీ హవా

Delhi Election Results Live: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉండడటం గమనార్హం. మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే 36 సీట్లు సరిపోతుంది. కల్కాజీలో ముఖ్యమంత్రి ఆతిశీపై బీజేపీ రమేష్ బిదూరీ ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. జంగ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వెనకబడ్డారు.