రేపటి నుంచి భాగ్యనగర్ రద్దు

ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు భాగ్యనగర్ తో పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాజీపేట – విజయవాడ సెక్షన్‌లోని ఖమ్మం స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 10 నుంచి 21 వ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. అలాగే కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్టుగా, కొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్టుగా వెల్లడించింది.
పలు ప్యాసింజర్ రైళ్లతో పాటు గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్‌లను వివిధ తేదీలలో రద్దు చేశారు. కాజీపేట – డోర్నకల్ రైలు, గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ తో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. అదే సమయంలో 17406 ఆదిలాబాద్- తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 9,11,14,18,19 తేదీలలో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. 20833 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 19, 20 తేదీలలో 75 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 19, 20 తేదీలలో 75 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. 12625 త్రివేండ్రం – న్యూఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 17, 19 తేదీలలో 60 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.