ముక్కు నేల‌కు రాస్తారా..?

-పదేండ్ల పాల‌న‌పై చ‌ర్చిద్దాం
- నేను ఓడితో ముక్కు నేలకు రాస్తా. మీరు ఓడితే ముక్కు నేలకు రాయాలి
-పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్నారు
-అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు
-ఈ ప్రాంత అభివృద్ది బాధ్య‌త నాది
-ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Telangana: “ఎంతో మంది పాలకులు వచ్చారు. ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారు. తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేద”ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర‌వారం నారాయణపేట జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం “ప్రజా పాలన–ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా గత పాలకుల పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్పుతో తెలంగాణ తిరిగి అభివృద్ధి బాటలోకి అడుగు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు రేవంత్. పదేళ్లపాలనపై చర్చకు సిద్ధమా? ఎక్కడైనా ఎప్పుడైనా తాము చర్చకు రెడీ అన్నారు రేవంత్ రెడ్డి.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన బాగోలేదని, అన్నీ లోపాలు, అవకతవకలేనని అంటున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ (KCR), 12 ఏళ్ల ప్రధానిగా ఉన్న మోదీ (Modi) అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12 నెలల నుంచి పాలన సాగిస్తోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) చర్చకు వస్తే సీఎంకు చర్చించడానికి నేను రెడీ. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం. చర్చలో నేను ఓడితో ముక్కు నేలకు రాస్తా. అదే విధంగా మీరు ఓడితే మీరు ముక్కు నేలకు రాయాలి. ఏమీ చేయకపోగా మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

“గడిచిన పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈరోజు పక్కరాష్టంతో నీటి పంచాయితీ ఉండేదు కాదు. పాలమూరు జిల్లా భవిష్యత్తు యువకుల మీద ఆధారపడి ఉంది. పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా నెట్టంపాడు, కోయిల్ సాగర్, మక్తల్ నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. అందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా” అని ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ బహిరంగా సభలో పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like