బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటా…

-వ్యక్తిగత ఇష్టంతో అదిలాబాద్ బాధ్య‌త‌లు తీసుకున్నా
-న‌న్ను కొంద‌రు ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు
-మీడియాలో వ్య‌తిరేక వార్త‌లు రాయిస్తున్నారు
-నా ప‌ని న‌న్ను చేయ‌నివ్వ‌డం లేదు
-ఆదిలాబాద్ పార్ల‌మెంట్ స్థాయి నేత‌ల స‌మావేశంలో మంత్రి సీత‌క్క ఆవేద‌న

Cpngress: కాంగ్రెస్ పార్టీ(Cpngress Party) ఆదిలాబాద్ పార్ల‌మెంట్ స్థాయి నేత‌ల స‌మావేశం హాట్‌హాట్‌గా సాగింది. నేత‌లు ఒక‌రికొక‌రు ఫిర్యాదులు, కౌంట‌ర్లు, అసంతృప్తులు ఇలా సాగింది స‌మావేశం. మీనాక్షి నటరాజ్ ముందు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇదంతా ఒక్కెత్త కాగా, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీత‌క్క సైతం త‌న అసంతృప్తి వెల్ల‌గ‌క్కారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల పనితీరుతో పాటు, జిల్లా ఇన్చార్జి బాధ్యతలపై సైతం మంత్రి సీతక్క (Minister Sitakka) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లా ఇన్చార్జి బాధ్యతలు నుంచి త్వరలోనే తప్పకుంటానన్న సీతక్క వెల్ల‌డించారు. తాను వ్యక్తిగత ఇంట్ర‌స్ట్‌తో అదిలాబాద్ ఇంచార్జీ బాధ్య‌త‌లు తీసుకున్నాన‌ని కానీ, కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న సీతక్క ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారన్న చెప్పారామే. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ తన పని చేయనివ్వడం లేదని మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. కేబినెట్ విస్తరణ తర్వాత ఇంచార్జీ మంత్రుల మార్పు సమయంలో ఆదిలాబాద్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని సీఎంను కోరుతానన్న సీతక్క నేత‌ల‌తో స్ప‌ష్టం చేశారు.

పాత నేత‌ల‌కు ప్రాధాన్య‌త లేదు..
కాంగ్రెస్ పార్టీలో పాత నేత‌ల‌కు ప్రాధాన్య‌త లేద‌ని ప‌లువురు నేత‌లు మీనాక్షి న‌ట‌రాజ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఒక్కరిద్దరు వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌త్తుమ‌ల్లేష్ ను ల‌క్ష్యంగా చేసుకుని ముగ్గురు నాయకులు న‌ట‌రాజ‌న్ ముందు ఆక్రోషాన్ని వెల్ల‌గ‌క్కారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జీలు స‌త్తుమ‌ల్లేష్ గురించి ప‌లు అంశాలు ఆమె ముందుంచారు. నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవమే కాకుండా, మాట్లాడుకుంటూ ఒక్కరికి ఒక్కరు కౌంటర్లు ఇచ్చుకున్నారు కూడా. ఇదే స‌మ‌యంలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఓటమి అంశం సైతం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌.ఇ ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమికి ఎవ్వరు పనిచేయకపోవడం కారణం కాదని.. అభ్యర్థి ఎంపికే తప్పు అని ఓ నేత అన‌డంతో అత‌నికి మ‌రో నాయ‌కురాలు కౌంట‌ర్ ఇచ్చారు. కులాల వారిగా జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని విభజిస్తున్నారని అన్నారు. పైగా వేరే జిల్లా అతను పార్టీని అడ్డం పెట్టుకుని సొంత వ్యాపారులు చేసుకుంటున్నాడ‌ని నేత‌ల దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై స్పందించిన పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్అలాంటి వారిపై చర్యలుంటాయన్నారు. వారిని జిల్లాలో అడుగు పెట్టనీయకుండా చేస్తామన్న పీసీసీ చీఫ్ హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like