ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర వెళ్తున్న డీసీఎం ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రిమ్స్ తరలించారు.