ఏసీబీ వలలో మరో చేప

ACB Attack: ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) లో మరో అవినీతి అధికారి ఏసీబీ(ACB)కి చిక్కారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రూ..50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) భవనం నిర్మాణం కోసం రూ.2 కోట్ల బిల్లు చేయాల్సి ఉంది. ఆ బిల్లు కోసం రెండు కోట్లలో తనకు 1% అంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్ష రూపాయలకు తగ్గించాడు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. ఆ లక్షలో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు దారుడి నుంచి రూ.50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు. ACB తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చని వెల్లడించారు.