మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Rate in Market: బంగారం ధర మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం అనూహ్యంగా ఈ రోజు పెరిగింది. అయితే, బంగారం ధర నేటికీ ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా సుమారు 4000 రూపాయలు తక్కువగా ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి…
ప్రాంతం 24 క్యారెట్లు 222 క్యారెట్లు
హైదరాబాద్ రూ.90,450 రూ.82,910
ఢిల్లీ రూ.90,600 రూ.83,060
చెన్నై రూ.90,450 రూ.82,910
ముంబై రూ.90,450 రూ.82,910
విజయవాడ రూ.90,450 రూ.82,910
బెంగళూరు రూ.90,450 రూ.82,910
ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 92,900 ఉంది. నిన్న ఇదే సమయానికి వెండి ధర రూ.93,900 ఉంది. ఇదిలా ఉండగా, ET వార్తల నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గవచ్చు . అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధరలు 38 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 38-40 శాతం తగ్గితే, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.55,000కి పడిపోతుందని అర్థం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా 9ం పైగా దేశాలతో టారిఫ్ వార్ ప్రకటించి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా టారిఫ్ వార్ కారణంగా, తీవ్రమైన నష్టం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం విలువైన లోహం గా పేరు ఉన్న బంగారం ధర మార్కెట్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు బంగారం పట్ల సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పనిచేస్తుంది అవగాహన కలిగి ఉన్నారు. . ఈ కారణంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. నిజానికి అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడమే అని చెప్పవచ్చు. అగ్రరాజ్యాలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసి తమ ట్రెజరీలో దాచుపెడుతున్నాయి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం వంటివి వచ్చినప్పుడు ఆ దేశాలు బయటపడేందుకు ఈ బంగారాన్ని వినియోగిస్తుంటాయి.