మంచిర్యాలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంచిర్యాల రానున్నారు. ఇక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు. మంచిర్యాలకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అనంతరం ఆయన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళతారు.