మహిళా.. మహిళా.. లోకానికి తెలిసింది నీ విలువ..
నిజంగానే అమ్మాయిల విలువ ఈ లోకానికి తెలిసింది. దానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే సాక్ష్యం. భారతదేశంలో అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేపట్టే ఈ సర్వేలో తొలిసారిగా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1020 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. నిజంగా ఈ మధ్య కాలంలో ఇది ఎంతో శుభవార్త అని చెప్పాలి. అమ్మాయి అని గర్భధారణ సమయంలో తెలిస్తే పురిట్లోనే వారిని చంపేసే వారు.. దీంతో అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోయింది. చాలా చోట్ల పెండ్లిళ్లకు అమ్మాయిలే దొరకని పరిస్థితి.
కేంద్రం విడుదల చేసిన సర్వేలో గతంతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్య చాలా మెరుగుపడింది. ఇంతకుముందు పురుషులతో పోల్చితే స్త్రీలు కేవలం ప్రతి వెయ్యి మందికి 992 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1020కి పెరిగింది. సర్వేలో వెలుగు చూసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లింగ నిష్పత్తి కూడా పెరగడం గతంలో ఉన్న దానికంటే ఈసారి నిర్వహించిన సర్వేలో సుమారు 10 శాతం అమ్మాయిల సంఖ్య పెరిగింది. 2015లో అమ్మాయిల సంఖ్య 1919 గా ఉంటే 2021 సంవత్సరం లో వారి సంఖ్య 1920 పెరిగినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. లింగ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది సుమారు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1037 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది.నగరాల్లో అయితే వీరి సంఖ్య 985 కు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు.
అయితే ఈ సర్వేలో ఒక ఆందోళనకర అంశం బయటపడింది. చాలా మంది అమ్మాయిలు పదేళ్ల కంటే తక్కువ వయసులోనే చదువుకు ముగింపు పలుకుతున్నట్లు తేలింది. చాలా మంది పాఠశాల విద్యను పూర్తి చేయకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక మోదీ తీసుకొచ్చిన జన్ ధన్ ఖాతాల వల్ల చాలా మంది మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. సుమారు 70 శాతానికిపైగా మందికి బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి. ఈ కాలంలో మహిళలు ఆరోగ్య సంరక్షణ మీద కూడా దృష్టి సారించాలని సర్వేలో వెల్లడైంది. పీరియడ్స్ సమయంలో ప్రత్యేకంగా ఆరోగ్యంపై మహిళలు ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నట్లు తేలింది.