బ‌స‌వేశ్వ‌రుడి చ‌రిత్ర అందరికీ ఆద‌ర్శం

Mancherial Collector Kumar Deepak: బ‌స‌వేశ్వ‌రుడి చ‌రిత్ర అంద‌రికీ ఆద‌ర్శమ‌ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించి ఆధ్యాత్మికత ప్రేరేపించిన మహనీయుడని కొనియాడారు. బుధవారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుడి జయంతి వేడుకలకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 12వ శతాబ్దపు సాధువు, సామాజిక సంస్కర్త, బసవేశ్వరుడు పుట్టినరోజు బసవ జయంతిగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థను వ్యతిరేకించడమే కాకుండా పనిని ఆరాధించమని, ఏమీ ఆశించకుండా సమాజానికి సేవ చేయాలని బోధ చేసిన‌ట్లు చెప్పారు. అనుభవ మంటపం అనే ఆధ్యాత్మిక వేదికను స్థాపించి సమానత్వం, సామాజిక న్యాయం అందరికీ అందేలా కృషి చేశారని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్ విశ్వగురు బసవేశ్వరుని చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.

You might also like