మంత్రుల పర్యటన.. బీఆర్ఎస్ నిరసన..

Ministers Ponguleti Srinivas Reddy, Seethakka: నిర్మల్ జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు కుంటాల వద్దకు చేరుకుంటుంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి మంత్రుల కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కాన్వాయ్ వచ్చేకంటే ముందే వారిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ తరలించారు. రైతులకు వడ్ల కొనుగోలులో జాప్యం, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.