చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక
DallasL బీఆర్‌ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతోంది. పార్టీ 25 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా సంబురాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ తదితరులు కార్యక్రమం విజయవంతానికి ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా అమెరికా న్యూజెర్సీలో జరిగిన కార్యకర్మంలో మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు గాదరి కిషోర్, క్రాంతి కిరణ్, గ్యాధరి బాలమల్లు తదితరులు కలిసి గెట్ టూ గెదర్ కార్యకర్మంలో పాల్గొన్నారు. జూన్ 1న సెంట్రల్ అమెరికాలోని డల్లాస్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ అందరూ ఈ సభ గురించి ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే వేలాది మంది ఈ సభకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. డల్లాస్‌లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు..? అందరూ వచ్చి పెద్దఎత్తున విజయవంతం చేయాలని పిలుపినిచ్చారు. ఇది అమెరికాలో బీఆర్‌ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుందని చెప్పారు. అలాగే డల్లాస్ తరువాత మిగిలిన దేశాల్లోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడులకు జరుపుకుంటారని వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరుకానున్నారు.