ఇక అత్యవసర సేవలకు డయల్ 112

Dial 112:ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేసేవారు. అయితే, ఇక మీదట మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుండి అత్యవసర సేవల కోసం 112 నెంబర్ కి కాల్ చేస్తే అన్ని సేవలు లభిస్తాయి. పోలీస్ 100, ఫైర్ 101, మెడికల్ 109, చైల్డ్ 1098 ఇలా పలు విధాలుగా అత్యవసర నెంబర్లు విడివిడిగా ఉండేది.. కానీ, ఇప్పుడు అన్నిటికి కలిపి ఒకే అత్యవసర నెంబర్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 112 డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి అధికారులు వెంటనే చేరుకుంటారు.

అమెరికాలోని 911 తరహాలో మన దేశంలో దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నంబర్‌ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లు 112 నంబర్‌ తీసుకు వచ్చింది. దీనికి ప్రాచుర్యం కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది, దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఒకటి, రెండు నెలల్లో డయల్‌ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ కార్యాచరణ సిద్ధం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like