రోడ్డు ప్రమాదం.. సబ్బులు మాయం..

Road Accident: రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డ్రైవర్ చనిపోయాడు.రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయినా జనాలకి ఇవేం పట్టలేదు. ప్రమాదంలో రోడ్డు పైన పడ్డ సబ్బులు ఎత్తుకుపోయారు..
లక్షేట్టిపేట మున్సిపల్ పరిధి ఇటిక్యాల సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొట్టాయి. రెండు లారీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఓ లారీడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంకు గురైన ఓ లారీలో సంతూర్ సబ్బుల లోడు ఉంది. లారీ నుండి సంతూర్ సబ్బుల పెట్టెలను జనం ఎగబడి తీసుకెళ్ళారు. లారీ లోడులో సగానికి పైగా లోడు ఖాళీ చేశారు. లక్షల రూపాయల విలువైన సబ్బులు మాయమయ్యాయి.