మనిషినే మర్చిపోయారు..

తమ ఆఫీసులో పని చేస్తున్న వ్యక్తినే మర్చిపోయారు.. చక్కగా తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయారు.. లోపల ఉన్న వ్యక్తి లబోదిబోమంటూ కేకలు వేయడంతో కొందరు ఆఫీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఓ యువకుడు టీ ఫైబర్ నెట్వర్క్ కేబుల్ వర్క్ చేయడానికి వచ్చాడు. అబ్బాయి పని చేస్తుండగానే సిబ్బంది సాయంత్రం కావడంతో కార్యాలయానికి తాళం వేసుకొని వెళ్లిపోయారూ. ఆ యువకుడు MPDO కార్యాలయం నుండి అరుస్తూ ఉండడంతో చుట్టుపక్క వారు చూసి కార్యాలయ సిబ్బందికి కాల్ చేశారు . సిబ్బంది చాలా సేపటి వరకు స్పందించలేదు.