విరిగిన క్లస్టర్… నిలిచిన రైళ్లు..

Railways: పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్‌వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఖాజీపేట, బలర్షా రైల్వే మార్గంలో ఎక్కడికక్కడ రైలు నిలిచిపోయాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతుల చేస్తున్నారు. ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు నిర్మించిన క్లస్టర్ విరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. క్లస్టర్ పూర్తిగా విరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేది.
ఈ నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దాదాపు 15 రైళ్లు ఆగిపోయాయి. మంచిర్యాల, పెద్దపల్లి, కొలనూరు, జమ్మికుంట తదితర ప్రాంతాల్లో రైళ్లను నిలిపివేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంకా పలు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చి ఆటోలు, బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.