పసుపుతో మ్యాజిక్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్!

Magical Splash :సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? అదే “మ్యాజికల్ స్ప్లాష్” (Magical Splash). వంటగదిలో ఉండే సాధారణ పసుపుతో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి వాట్సాప్ స్టేటస్‌ల వరకు ప్రతీ చోటా వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ కట్టిపడేస్తున్న ఈ “లిక్విడ్ గోల్డ్” మ్యాజిక్ ఏంటి…? దీనిని మీరు కూడా చేయొచ్చు.. ఎలా అంటే.. ఇదిగో ఇలా..
కేవలం మీ సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్, ఒక గ్లాసు నీళ్లు, చిటికెడు పసుపు ఉంటే చాలు మీ ఇంటిని ఒక మాయా ప్రపంచంగా మార్చేయవచ్చు. ముందుగా ఒక గదిలోని లైట్స్ ఆపివేసి, మీ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్ ఆన్ చేయండి.. దాన్ని ఒక టేబుల్ పై ఉంచి నీళ్లతో నిండిన గాజు గ్లాసు ఫ్లాష్‌లైట్ పైన పెట్టండి.. ఇప్పుడు గ్లాసులోని నీళ్లపైన చిటికెడు పసుపు చల్లాలి.. అప్పుడు పసుపు నీటిలో కలిసి కిందకు డ్రాప్స్ లా పడుతూ ఉంటుంది… అప్పుడు ఆ గ్లాసు మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతూ అద్భుతంగా కనిపిస్తుంది. చూడటానికి అద్భుతంగా ఉంటడమే కాదు… ఆనందాన్ని కూడా పంచుతుంది…