మాదారంలో సింగరేణి క్వార్టర్ల కూల్చివేత

Madaram Town Ship: బెల్లంపల్లి ఏరియా మాదారం టౌన్షిప్ లో గుట్ట కింద ప్రాంతంలో సింగరేణి క్వార్టర్ల కూల్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా క్వార్టర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలోనే వాటిని కూల్చివేస్తున్నారు. మాదారం మెగా ఓపెన్ కాస్ట్ అవుతుందనే ప్రచారంతో ఈ కూల్చివేతలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కూల్చివేతలు కేవలం ఈ ప్రాంతంతోనే ఆపేస్తారా…? కార్మికులు లేని మిగతా ప్రాంతాలలో కూడా కూల్చివేస్తారా.. తెలియాల్సింది ఉంది.. ఎస్ అండ్ పీసీ ఇన్స్పెక్టర్ రాజమౌళి పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి..