భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

Gold Price : పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి వ‌స్తున్నాయి. లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి త‌గ్గుతోంది. మొన్నటి దాకా కొండెక్కిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయన్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివచ్చాయి. వెండి ధర కూడా తగ్గముఖం పట్టడం గమనార్హం..

బంగారం ధర భారీగా తగ్గింది. ఇటీవల లక్షా రెండు వేలు దాటిన తులం బంగారం… ఇప్పుడు 97 వేలు ఉంది.. అంటే దాదాపు.. 5వేల వరకు ధరలు తగ్గాయి.. తాజాగా శనివారం (జూన్ 28 2025) కూడా బంగారం ధరలు తగ్గాయి.. శనివారం బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశియంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.97,420 లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 89,300 ఉంది. 24 క్యారెట్లపై రూ.600, 22 క్యారెట్లపై రూ.550 మేర ధర తగ్గింది. వెండి కిలో పై రూ.100 తగ్గి రూ.1,07,800 లుగా ఉంది.

బంగారం ధర గడిచిన ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. లక్ష రూపాయలు దాటిన బంగారం అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం 97 వేల రూపాయల వరకు దిగింది. అంటే బంగారం ధర ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూస్తే దాదాపు రూ. 5000 వ‌ర‌కు త‌గ్గింది. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన అనంతరం బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావం కూడా ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణం అని చెబుతున్నారు. మరో ప్రధాన కారణం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పుంజుకోవడం కూడా అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

గడిచిన ఏడాది కాలంగా బంగారం, వెండి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌ భారీగా పెరిగాయి. గత సంవత్సరం జూన్లో బంగారం ధర రూ. 75 వేల సమీపంలో ఉండ‌గా, అక్కడ నుంచి బంగారం ధర వ‌రుస‌గా పెరుగుతూ ఏకంగా 1 లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన పరిస్థితులే కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బలహీనపడినప్పుడల్లా బంగారంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం వ్యాపారులు అమ్మకాలు జరపడంతో.. వచ్చే వారం కూడా బంగారం ధర తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like