మేడారం జాత‌ర తేదీలు ఖ‌రారు

Medaram Jathara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.

2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పించుకుంటారు. ఈ మేరకు అధికార యంత్రాంగం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like