తండ్రి కొడుకులకు పాము కాటు… కొడుకు మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను పాముకాటు వేయగా ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. గురువారం రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బెల్లంపల్లి బస్తి మార్కెట్ ఏరియాకు చెందిన జనగాం ప్రవీణ్, అతని కుమారుడు వేదాంతను పాము కాటేసింది. దీంతో వేదాంత మృత్యువాత పడ్డాడు. తండ్రి ప్రవీణ్ కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.