జిల్లా అద‌న‌పు కలెక్ట‌ర్‌గా ఆర్డీవో

మంచిర్యాల జిల్లా అద‌న‌పు కలెక్ట‌ర్‌(రెవెన్యూ)గా మంచిర్యాల ఆర్డీవో శ్రీ‌నివాస్ రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. త‌ర్వాత ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు శ్రీ‌నివాస్ రావు అద‌న‌పు కలెక్ట‌ర్‌(రెవెన్యూ)గా కొన‌సాగుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ అద‌న‌పు క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన స‌బావ‌త్ మోతీలాల్ గ‌త నెల ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి పోస్టు ఖాళీగానే ఉంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్డీవోకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

You might also like