మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ Rajiv Gandhi Institute of Medical Sciences(RIMS)లో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాహిల్ చౌదరి (Sahil Chaudhary)(23) హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (suicide)కు పాల్పడ్డాడు.
2023-24 బ్యాచ్ కు చెందిన సాహిల్ రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్ కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. బాయ్స్ హాస్టల్లో ఉండే సాహిల్ 125 నంబర్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలో నుంచి తోటి విద్యార్థులు బయటకు వెళ్లగానే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే విద్యార్థులు సాహిల్ ను ఎంసీయూఐకి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసైన సాహిల్, చదువులో ముందుండేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడే ఏం చెప్పలేమని, కారణాలపై అన్వేషిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. రాజస్థాన్ నుండి ఇక్కడకు వచ్చి వైద్యవిద్య నేర్చుకుంటున్న క్రమంలో ఇక్కడ తనువు చాలించడం దిగ్భ్రాంతిగా ఉందని డైరెక్టర్ తెలిపారు.