పేకాట రాయుళ్ల అరెస్టు

Arrest of poker players:పేకాట ఆడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. సిర్పూర్ టి రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.26,470/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు. చింత‌కుంట‌కు చెందిన బింగినేని తిరుప‌తి, ఎ.మహేశ్వర్, బి. రాజుల‌ను అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో చంకపురి మోహన్, బండా రవి, మొహమ్మద్ గుద్దు, ఎనుములే సునీల్, నవీన్, తమ్మ అనే వారు త‌ప్పించుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌ట్టుబ‌డిన వారిపై సిర్పూర్ టి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారని చెప్పారు. ఈ దాడుల్లో S.I రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహమూద్, కానిస్టేబుళ్లు విజయ్, మధు, రమేశ్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్న‌ట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ వెల్ల‌డించారు.

You might also like