మండ‌ప‌ నిర్మాణం అడ్డుకోవ‌ద్దు..

Telangana State SC and ST Commission Chairman Bakki Venkataiah: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డబస్తిలో 21వార్డ్ లో ఇటీవల కూల్చివేసిన వినాయ‌క మండ‌ప నిర్మాణాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న క‌మిష‌న్ స‌భ్యులు రేణికుంట్ల ప్రవీణ్, కుర్సం నీలాదేవి, జిల్లా శంకర్, రాంబాబు నాయక్ వినాయక మండపాన్ని సంద‌ర్శించారు. స‌బ్ క‌లెక్ట‌ర్ మ‌నోజ్‌, ఏసీపీ ర‌వికుమార్‌, త‌హ‌సీల్దార్ కృష్ణ‌తో మాట్లాడార ప్రభుత్వం స్థలంలో నిర్మించే వినాయక మండపాన్ని భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసర నిమిత్తం ఉపయోగించుకోవచ్చని ఇప్పుడైతే మండప నిర్మాణాన్ని అడ్డుకోవద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సూచించింది. అనంత‌రం ప‌లువురు ఇచ్చిన వినతిపత్రాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.

You might also like