మ‌రోసారి త‌న‌దైన ముద్ర… మీనాక్షి న‌ట‌రాజ‌న్‌

AICC Telangana affairs incharge Meenakshi Natarajan:కాంగ్రెస్ అంటేనే కాస్త హడావుడి ఎక్కువ.. అధికారంలో ఉన్న పార్టీ… ఒక గ్రామ‌స్థాయి నాయ‌కుడైనా స‌రే హంగూ ఆర్భాటం ఉండాల్సిందే.. ఇక పెద్ద స్థాయి నాయకుడి గురించి చెప్పాల్సిన ప‌నే లేదు… అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఇంచార్జి అంటే ఇంక ఆ నాయకుడి పర్యటనలో హంగామా మామాలుగా ఉండదు. మ‌రీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ అంటే ఎంత మంది నాయ‌కులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఉండాలే… కానీ, ఇక్క‌డ ఇలాంటిది ఏమీ లేదు… ఆమె వ‌చ్చిన విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌దు.. సామాన్య కార్య‌క‌ర్త‌లా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు..

సాధార‌ణ కార్య‌క‌ర్త‌లా ఉండే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మ‌రోసారి త‌న‌దైన శైలి ప్ర‌ద‌ర్శించారు. ఆమె గురువారం ఆదిలాబాద్ జిల్లా వ‌చ్చారు. రాత్రి టీటీడీ సీలో బస చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి శ్రమదానం చేసిశారామే.. ఆర్భాటం లేకుండా (గోప్యంగా) మీనాక్షి పర్యటన కొన‌సాగుతోంది.

You might also like