కాళ్లు మొక్కుతం

సింగరేణి మారుపేర్ల వారసుల ఆందోళన...

Singareni:సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కరించాలంటూ డిపెండెంటు ఉద్యోగ బాధితులు ఆందోళ‌న నిర్వ‌హించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏఐటియూసి కార్యాలయం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఏండ్లు గడుస్తున్నా తమ సమస్య పరిష్కరించటంలో గుర్తింపు, ప్రాతినిథ్య‌ సంఘాల నేతలు స్పందించడం లేదంటూ ప్ల కార్డుల‌తో కార్యాలయం ఎదుట అందోళన చేస్తూ బైటఠాయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కార్మిక సంఘాలు స్పందించి తమ సమస్యను పరిష్కరించి ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆఫీసులో ఉన్న ఏఐటియూసి నేత వాసిరెడ్డి సీతారామయ్య వద్దకు వెళ్లి తమ సమస్య పరిష్కారం కోసం కృషి చెయ్యాలంటూ కోరారు. తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిష్కరించటం లేదంటూ నాయకులతో వాగ్వావాదానికి దిగారు. కార్మిక సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాధితులు వాసిరెడ్డి సీతారామ‌య్యా కాళ్లు మొక్కారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like