ఓపెన్‌కాస్టుపై కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
Contract workers’ concerns over opencast:శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు(Open Cost Project)పై కాంట్రాక్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని, సంస్థ యాజమాన్యం జాడాపత్తా లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ఉద్యోగుల వేతనాలు చెల్లించడం లేదని యాజమాన్యం కావాలనే జాప్యం చేస్తోందని వెల్లడించారు. ఆకలితో అలమటిస్తున్న తమ కుటుంబాలను కాపాడాలని కోరారు. జీతాలు ఇచ్చేంత వరకు కార్మికుల పోరాటం ఆపమని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, తమని లక్ష్యంగా పెట్టుకుని ఏదైనా చేయాలని చూసినా తమ పోరాటాలు ఆగవంటూ మరోమారు స్పష్టం చేశారు.
వచ్చే దసరా పండుగకు అందరూ సంతోషంగా ఉంటే, తాము మాత్రం జీతాలు లేక కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని దుస్థితిలో అలమటించాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి రోజు జీఎం కార్యాలయం, ఇతర కార్యాలయాల చుట్టూ జీతాల కోసం తిరగాల్సి వస్తోందన్నారు. తమ జీతం అనేది వాళ్లు భిక్షం అనుకుంటున్నారని, అది భిక్షం కాదని తమ హక్కు అని స్పష్టం చేశారు. తమ జీతాలు వచ్చేంత వరకు ఓపెన్‌కాస్టు మొత్తం నిర్బంధిస్తామన్నారు.