ఒమిక్రాన్‌పై ఐసీఎంఆర్ గుడ్‌న్యూస్

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్).
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందర్నీ కలవరపెడుతోంది. ఇప్పటికే 28 దేశాలకు పాకిన ఈ వైరస్.. మన దేశంలోకి కూడా అడుగుపెట్టేసింది. దీంతో, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్). హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని గుడ్‌న్యూస్ చెప్పింది. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.
దీనిపై ఐసీఎంఆర్ అధికారి మాట్లాడుతూ కోవాగ్జిన్ అనేది వైరియన్-ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్ చేస్తుంది. అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుందని వివరించారు. కోవాగ్జిన్ కేవలం ఒమిక్రాన్‌పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్‌పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
మరో అధికారి మాట్లాడుతూ కోవాగ్జిన్ ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా మనకు రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కొన్ని శాంపిల్స్ స్వీకరించి పరిశోధన చేశాం. మరిన్ని శాంపిల్స్ స్వీకరించిన తర్వాత, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తాం. ఆ తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.