స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

తెలంగాణ స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహించ‌నున్నారు. మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం గ్రామ పంచాయితీలు 12,733.. వార్డులు 1,12, 288ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అక్టోబర్‌ 23,న మొద‌టి విడ‌త‌గా, 27న రెండ‌వ విడ‌త‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. అదే విధంగా అక్టోబర్ 31న మొద‌టి విడ‌త‌, నవంబర్ 4న రెండో విడ‌త‌, 8న పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. నవంబర్‌ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుద‌ల చేయ‌నున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్.. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది.. మొదటగా రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like