సమ్మెపై నేడు చర్చలు
సింగరేణి కార్మిక సంఘాలతో సోమవారం ఆర్ఎల్ సీ చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో సమ్మె నోటీసు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్ల్ లను ప్రైవేటీకరించవద్దని, సింగరేణికే కేటాయించాలని లేకపోతే 9,10,11 తేదీల్లో సమ్మెకు దిగుతామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా ఐఎన్టీయూసీ,ఏఐటీయూసీ,సీఐటీయూ,బీఎంఎస్,హెచ్ఎంఎస్ యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం కూడా కార్మిక సంఘ నేతలను పిలిచి మాట్లాడింది. సమ్మె విరమించుకోవాలని యాజమాన్యం స్పష్టం చేసింది. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె ఆలోచనపై వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. ఈ రోజు ఆర్ఎల్ సీ నిర్వహించే సమావేశంలో కూడా ఏం తేలే అవకాశం కనిపించడం లేదు.
కార్మిక లోకం సమ్మెకు సిద్ధంగా ఉండాలి – జనక్ ప్రసాద్, సెక్రటరీ జనరల్,ఐఎన్టీయూసీ
ఈ రోజు ఆర్ ఎల్సీతో నిర్వహించే సమావేశంలో ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. RLC మధ్యవర్తిత్వం చేసి సమ్మెపై ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేకపోతే సమ్మెకు కార్మిక లోకం సిద్ధంగా ఉండాలి. సమ్మె నోటీసులో మేం ఇచ్చిన అన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిందే.