సింగరేణిలో చర్చలు విఫలం
RLCతో విఫలమైన చర్చలు - 8వ తేదీలోపు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించకపోతే సమ్మెకు సిద్ధం
హైదరాబాదులోని రీజనల్ లేబర్ కమిషనర్ ఎదుట సింగరేణి యాజమాన్యంతో ఆరు కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన విఫలమయ్యాయి. సమావేశం వివరాలు INTUC సెక్రటరీ జనరల్ బి.జనక్ప్ర సాద్ వెల్లడించారు. అర్ఎల్సీ మధ్యవర్తిత్వం వహించి సింగరేణి ద్వారా 8వ తేదీలోపు ముఖ్యమంత్రి తో అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కేలా ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి RLC చొరవ చూపాలన్నారు. విషయం జేఏసీ నాయకులు అర్ఎల్ సి సింగరేణి యాజమాన్యానికి చెప్పామన్నారూ. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా వారితో చర్చించడానికి కార్మిక సంఘాలు జేఏసీ తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. ముఖ్యమంత్రితో వెంటనే అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. లేకపోతే సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకోవడానికి సమ్మె అనివార్యమన్నారు. కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు.