రైతుపై అడ‌వి పందుల దాడి.. తీవ్ర గాయాలు

రైతుపై అడ‌వి పందులు దాడులు చేయ‌డంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ‌లం గోయగాంలో జ‌రిగ‌ని ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి… తిర్యాణి మండ‌లం గోయ‌గాంకు చెందిన రైతు మేక భీమేష్(37) చేను నుంచి ఇంటికి వెళ్తున్నాడు. హ‌ఠాత్తుగా పందుల గుంపు ఆయ‌న‌పై ప‌డింది. దీంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టు పక్కల రైతులు బాధితుడిని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

బాధితుడికి అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని, అత‌న్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని అట‌వీశాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.

 

You might also like