వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత పార్టీ నుంచే పోటీ

Kalvakuntla Kavitha:బీఆర్ఎస్ పై మనసు విరిగింది… కేసీఆర్ పిలిచిన సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తామ‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. శుక్ర‌వారం తెలంగాణ శాసన మండలి మెంబర్స్ లాంజ్ కల్వకుంట్ల కవిత విలేక‌రుల‌తో మాట్లాడారు. సెప్టెంబర్ 3న తాను నా రాజీనామా చేశాన‌ని
నాలుగు నెలలుగా నా రాజీనామా ఆమోదించ‌లేద‌ని ఆమె అన్నారు. ఇప్పుడు కౌన్సిల్ నడుస్తోంది.. నా రాజీనామా ఆమోదించే ముందు ఫ్లోర్ లో నేను మాట్లాడే అనుమ‌తి ఇవ్వాలని చైర్మ‌న్ ని అడుగుతాన‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.. హౌస్ లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటానని వెల్ల‌డించారు.

కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలు ఆమోద యోగ్యం కాదన్నారు క‌విత‌.. ఆయ‌న కేసీఆర్ ని ఉరి తీయాలి అంటున్నాడు… రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలని స్ప‌ష్టం చేశారు. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్.. ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చెయ్యడం అన్యాయమ‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుందన్నారు.

హరీష్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారు.. ఆయన హౌస్ లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డితో ఆయన ఛాంబర్ లో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసన్నారు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకారం ఇస్తే బీఆర్ఎస్ కు నష్టమేన‌న్నారు. మొదటి నుండి నేను స్వతంత్రంగా పని చేశానని, కేసీఆర్ డైరెక్షన్లో హరీష్ కేటీఆర్ పని చేశారని అన్నారు. నేను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళానన‌ని క‌విత వెల్ల‌డించారు. జాగృతి జనంబాటలో ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్న.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్త ఒక్క కరెంట్ ఫోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదు.. మిషన్ భగీరథ ఆగం చేశారు.. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like