ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Tension at MLA camp office:నెల రోజులు సోయా కొనుగోళ్లు జరగడం లేదని రైతుల దుస్థితిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సోయా కొనుగోళ్లు చేయాలని కొద్ది రోజులుగా రైతులకు మద్దతుగా వారు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
సోయా కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యే ముట్టడికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సోమవారం (5వ తేదీన) జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని, ఆరవ తేదీన జిల్లా కేంద్రంలో బందుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. జిల్లా రైతాంగ మెదుపుకుంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన కొలుసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.