కవిత రాజీనామా ఆమోదం… ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
Kalvakuntla Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా శాసన మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా మారింది. దీంతో ఆమె శాసన మండలి సభ్యత్వం నుంచి పూర్తిగా వైదొలిగినట్లైంది.
కవిత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సమర్పించిన సమయంలో చైర్మన్ ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించినప్పటికీ, తన నిర్ణయంపై కవిత స్థిరంగా నిలిచారు. చివరికి ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించారు.
ఈ నిర్ణయంతో కవిత రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే ఆమె కొత్త రాజకీయ వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారని, భవిష్యత్తులో భిన్నమైన రాజకీయ వేదికపై ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపై అధికార, ప్రతిపక్ష పార్టీల కదలికలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
మొత్తానికి, కవిత రాజీనామా ఆమోదంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచింది..