సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

SP Sirisetty Sankeerth:ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 8న భూపాల‌ప‌ల్లి జిల్లాకు రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కొడవటంచ ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, హెలిప్యాడ్ మరియు రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం భూపాలపల్లి పట్టణం మంజూరు నగర్‌లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

You might also like