హ‌స్తం హ‌వా..

Telangana Municipal Election:మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ఫలితాలు ఇప్పటికే వెలువడటంతో ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ 220 వార్డులు, బీఆర్ఎస్ 119 వార్డులు, బీజేపీ 28, ఇత‌రులు 25 వార్టుల్లో విజ‌యం సాధించారు.

బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తిచేసిన అధికారులు అసలు ప్రక్రియ ప్రారంభించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే కాంగ్రెస్ పార్టీ త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మున్సిపాలిటీల పలితం మధ్యాహ్నానికి, కార్పోరేషన్ల ఫ‌లితం సాయంత్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు.

 

You might also like