ఇరాన్ దాడులు.. మ‌రింత‌గా గ్యాస్ సంక్షోభం

త‌న‌పై జ‌రుగుతున్న దాడుల‌కు బదులుగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ప్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. బుధవారం అర్ధరాత్రి తరువాత ఖతార్‌లోని ఖతారీ కాంప్లెక్స్ అనే ఎల్ఎన్‌జీ ప్లాంట్ పై ఆ దేశం దాడి చేసింది. ఈ దాడిలో ప్లాంట్ భారీ ఎత్తున దెబ్బతిన్న‌ది. ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా అయ్యేది ఇక్క‌డి నుంచే. ఆ త‌ర్వాత సౌదీఅరేబియాలో సైతం చ‌మురు రిఫైన‌రీల‌పై దాడులు నిర్వ‌హించింది.

గల్ఫ్‌ దేశాల చమురు నిల్వ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ రిఫైనరీ గ్యాస్) రిఫైనరీ ప్లాంట్ అయిన రస్ లఫ్ఫాన్‌పై దాడి చేసింది. దీంతో ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసుకుపోయి చమురు రవాణా స్తంభించిన నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్‌లోని చమురు కేంద్రాలపై దాడులు జరగడం ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది. ముఖ్యంగా గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతే అనేక దేశాలు మ‌రింత‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఇప్పటికే సరైన చమురు సరఫరా లేకపోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరింది. ఇప్పుడు గల్ఫ్‌ కేంద్రాలపై దాడులు, అక్కడ చమురు ఉత్పత్తి నిలిచిపోతే ఆయిల్ సరఫరాకు ఇంకా ఇబ్బంది కలుగుతుంది.

ఖతార్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనది రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీ. ఇక్కడి గ్యాస్ ప్లాంట్ల నుంచే ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా అవుతుంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47శాతం ఖతార్ నుంచే లభిస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్‌ ఎనర్జీ స్పందిస్తూ ఇరాన్‌ క్షిపణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్‌ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎగుమతి టెర్మినల్ పై ఇరాన్ దాడి చేసిందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. ఇరాన్ లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల ఫలితంగా రాస్ లాఫాన్ ప్రాంతంలో చెలరేగిన మంటలను పౌరరక్షణ బృందాలు అదుపు చేస్తున్నాయని ఎక్స్ లో పోస్టు చేశారు.

ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమాయకపు ఖతార్ పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా తాము ఇరాన్ పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో పార్స్‌ గ్యాస్‌ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీపై ఇరాన్‌ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్‌ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేయడం.. ప్రపంచాన్ని మరింత గ్యాస్ సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47శాతం ఖతార్ నుంచే లభిస్తుంది. ప్రస్తుతం ఇరాన్ దాడి వల్ల భారత్‌లో తలెత్తిన గ్యాస్ సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతుంది.

భార‌త్‌పై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం 50 శాతం చమురును అంతర్జాతీయ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ఖతార్‌ నుంచి 20 శాతం ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది అక్కడి నుంచి ఉత్పత్తి, రవాణా తగ్గిపోతే భార‌త్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి, విద్యుత్ ఉత్పత్తికి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రస్తుతం ఇండియా ప్రతిరోజూ 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూమిక్ మీటర్స్ (ఎంఎంఎస్‌సీఎండీ)వినియోగిస్తోంది. ఇందులో 97.5 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like