ఉద్యోగుల విభజనపై హైకోర్టు లో కేసు
తెలంగాణలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశంలో హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. G O Ms No 317, Dt. 6.12.2021తో పాటు దాని అనుబంధంలో జారీ చేసిన మార్గదర్శకాలు చట్ట విరుద్ధమని వాటి ప్రకారం ఎటువంటి కేటాయింపులు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు లో కేసు దాఖలయ్యింది. దీనికి సంబంధించిన కేసు మంగళవారం విచారణ జరగనుంది. క్యాడర్ స్ట్రెంత్ విభజించకుండా , నూతన జిల్లాలు, నూతన జోన్లు, నూతన మల్టీ జోన్ల వారీగా కొత్త పోస్టులను మంజూరు చేయకుండా ప్రభుత్వం విభజన ప్రక్రియను చేపట్టడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రక్రియ తీవ్ర అయోమయానికి దారితీసే పరిస్థితి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల సర్దుబాటుపై ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో స్పష్టత లేదని, ఉద్యోగుల్లో గందరగోళం ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఉద్యోగుల కేటాయింపు చేయవద్దని పిటిషన్ వేశారు. మంగళవారం దీనిపై విచారణ జరుగుతుంది.