కేసీఆర్ పై పోటీకి సై
- అన్నీ ఆలోచించాకే బీజేపీలో చేరా
- కేసీఆర్ కుటుంబం ఖనాజాకు కాపాలాదారులే... వారసులు కాదు
- కాంగ్రెస్‌లో చేరుతున్నానని కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నాడు
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్‌లో పంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. అక్కడ భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు కాపలదారులే తప్ప వారసులు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి మెదట సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. అన్నీ అలోచించుకున్నాకే బీజేపీలో చేరానని.. తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే అంశం టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. బీజేపీలో గ్రూపులు లేవు. బండి సంజయ్ తో నాకు వైరం ఉందని టీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని వెల్లడించిన ఈటెల, టీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదవాని ళ్ళే నన్ను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్‌తో దోస్తీ లేదని కొట్లాటనే అన్నారు. తెలంగాణలో అధికారం బీజేపీదేనని మరోమారు స్పష్టం చేశారు. ఏడున్నరేళ్ళుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖ్యమంత్రికి ముందుచూపు లేకపోవడం వలన రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి ఆ తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆది అని గుర్తు చేశారు. కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చిందని, వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవద్దని కోరారు. హుజురాబాద్ ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడన్న నా మాటకు కట్టుబడి ఉన్నానని మరోమారు స్పష్టం చేశారు. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్ దని విరుచుకుపడ్డారు.