వివాదంలో ఇంధన్‌పల్లి ఎఫ్ఆర్ఓ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణ వివాదంలో చిక్కుకున్నారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం స‌ర్ అన్నా క‌నిక‌రించ‌కుండా లాఠీతో కొట్టారు. త‌మ‌తో అవమానకరంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. చేప‌ల వేట‌కు వెళ్తే లాఠీల‌తో కొట్ట‌డం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

You might also like