రేపు ఢిల్లీకి మంత్రుల బృందం
రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి పార్టీ లీడర్లతో సమావేశమై మాట్లాడారు కేసీఆర్. సమావేశంలో సిఎం కేసిఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే లు జనాల్లో వుండాల న్నారు. ప్రభుత్వ పథకాలు వివరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నేను గెలిపించుకుంట అని హామీ ఇచ్చారు. మీరు జనాల్లో లేకపోతే ఎవరు ఏమి చేయలేరని హెచ్చరించారు. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టాలన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు అర్థం అయ్యే విధంగా చెప్పాలని స్పష్టం చేశారు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి మనం ధాన్యం కొనటం లేదని చెప్పాలన్నారు. వరి కి ప్రత్యామ్నాయ పంటలు రైతులకు వివరించాలన్నారు.
✴️ రేపు దిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని నిర్ణయం
✴️ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను కలవనున్న మంత్రులు
✴️ ఈనెల 20న అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు
✴️ కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయాలని సీఎం నిర్ణయం
నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశం