మ‌ద్యం షాపులో చోరీ : సీసీ కెమెరాలో రికార్డు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ లిక్కర్‌ మార్ట్‌ను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. మార్ట్‌లోకి చొరబడిన దుండగులు మద్యం బాటిళ్లతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.

కాగజ్ నగర్ పట్టణంలోని త్రినేత్రి వైన్స్ దుకాణంలో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణం యజమాని ఉదయం షాపు తెరిచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ దృశ్యాలన్నీ దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. 3000 నగదు ఒక మద్యం బాటిల్ చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు పట్టణ ఎస్.హెచ్.ఓ. ప్రేమ్ కుమార్ తెలిపారు.

You might also like