సీసీఐ బకాయిలు చెల్లించేలా చ‌ర్యలు తీసుకోండి

కలెక్టర్‌ను కోరిన ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు

సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ. 4.44 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్‌ను కోరారు. వారు ఆయ‌న‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ సీసీఐ ఫ్యాక్టరీ డిస్మెంట‌ల్ అయిన నేప‌థ్యంలో మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ. 4 కోట్ల 44 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. మున్సిపాలిటీకి రావాల్సిన నిధులు అందేలా సీసీఐ అధికారులను ఆదేశించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ.. సీసీఐ బకాయిల విషయమై గతంలో పలుమార్లు ఢిల్లీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సీసీఐ మేనేజర్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినా సీసీఐ అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై మరోసారి ఢిల్లీ స్థాయి అధికారులతో మాట్లాడి బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్‌, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, పర్వేజ్ మహబూబ్, నాక్సన్ , కిషోర్ సలీం , రషీద్ , రిజ్వాన్ , బబ్లు అన్నపూర్ణ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

You might also like