ఆట.. ఉత్సాహం.. విజయోత్సాహం!
పోలీస్ వార్షిక క్రీడలు–2026 మూడు రోజుల పాటు ఆదిలాబాద్ ఉత్సాహం భరితంగా నిర్వహించారు. పరుగు పందాలు నుంచి వాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, లాంగ్ జంప్, రిలే తదితర విభాగాల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పోటీ పడ్డారు. వారితో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం గెలుపు కోసం కాదు.. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ కోసం అంటూ వెల్లడించారు. ఈ క్రీడల్లో పోలీసు కుటుంబ సభ్యులు, చిన్నారులు సైతం పాల్గొని మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ వంటి ఆటలతో క్రీడా ప్రాంగణాన్ని మరింత సందడిగా మార్చారు. ఓవరాల్ చాంపియన్‌గా క్యూఆర్టీ వారియర్స్ జట్టు నిలవగా, విజేతలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు అందజేసి అభినందించారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారాయన… కలిసి ఆడాం.. కలిసి గెలిచాం.. మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుదామంటూ ఎస్పీ సిబ్బందిని ఉత్సాహపరిచారు.