మాదారం డిస్పెన్స‌రీ త‌ర‌లిస్తే స‌హించం

మాదారం టౌన్ షిప్‌లోని సింగ‌రేణి ఆసుప‌త్రి (డిస్పెన్స‌రీ) త‌ర‌లిస్తే స‌హించేది లేద‌ని బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య హెచ్చ‌రించారు. మాదారం డిస్పెన్సరీని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆయ‌న ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా డిస్పెన్సరీని తరలించకుండా స్థానిక ప్రజలకు అందుబాటులోనే కొనసాగించాలని అధికారులను కోరారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక‌వేళ దానిని త‌ర‌లిస్తే బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

అంత‌కుముందు ఆయ‌న మాదారం రామాలయంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రణయ్, మాజీ జడ్పీటీసీ సురేష్, బీఆర్ఎస్ నేత‌లు గట్టు సంతోష్, ఎలుక రామ్ చందర్, గోమాస తిరుపతి, మొగిలి శంకర్, బోడ సతీష్, క్రాంతి, డాక్ట‌ర్ రాజేంద‌ర్, ఎముల‌కుర్తి సుభాష్‌, శ‌శి, మ‌హిళా నాయ‌కురాళ్లు ర‌మాదేవి, చంద్ర‌క‌ళ‌, రాజ‌మ‌ణి, గుండేటి ల‌క్ష్మి, సౌమ్య‌, కోల‌జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

You might also like