మంచిర్యాలలో పేకాటరాయుళ్ల అరెస్ట్
మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న హరినిలయ విల్లాస్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్ఐ లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో రూ. 40,300, మూడు సెల్ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కత్రె గణేష్, ఆరె రాజేష్, మహమ్మద్ అన్వర్ పాషా, పోలక మల్లేష్ ను అరెస్టు చేసి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.