16న సింగరేణి లాభాల వాటా చెల్లింపు
ఈ నెల 16న సింగరేణి లాభాల వాటా చెల్లించనున్నారు. ఈ మేరకు కార్మికుల ఖాతాల్లో ఆ రోజు జమ చేయనున్నారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.1,53,912 బోనస్గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సంస్థలో పనిచేస్తున్న 38,737 మంది పర్మినెంట్ కార్మికులకు లాభాల వాటా అందనుంది. సంస్థలో పనిచేస్తున్న 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు సైతం రూ. 5,500 బోనస్గా చెల్లిస్తామని తెలిపారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.1,754 కోట్ల నికర లాభాలు ఆర్జించగా 34 శాతం వాటాగా రూ. 596 కోట్లు పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.